రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ.. 20 సెకండ్ల పుష్ప 2 ప్రోమో సాంగ్ కి ఎన్ని లక్షల వ్యూస్ వచ్చాయంటే..?

by Disha Web Desk 10 |
రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ.. 20 సెకండ్ల పుష్ప 2 ప్రోమో సాంగ్ కి ఎన్ని లక్షల వ్యూస్ వచ్చాయంటే..?
X

దిశ, ఫీచర్స్: పుష్ప సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇటీవలే టీజర్ విడుదలతో చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో గంగమ్మ జాతర లో పుష్ప ఫైట్ చూపించిన తర్వాత సినిమాకి భారీ హైప్ క్రియోట్ చేసింది.

తాజాగా, ఇప్పుడు ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. పుష్ప సినిమా ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్ప అనే పాట మే 1న విడుదల కానుందని అని ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే దీనిలో ఆకట్టుకునే విషయం ఏమిటి అంటే ఈ పోస్టుతో పాటు ఈ పాట కి సంబంధించి ఈ పాట ప్రోమోని కూడా విడుదల షేర్ చేశారు. పుష్ప పుష్ప అనే లిరిక్స్ తో మొదలైన ఈ పాట గూస్ బంప్స్ పక్కా ఇవ్వనుందని అర్థమైపోతుంది.

నిన్న విడుదల చేసిన 20 సెకండ్ల పుష్ప 2 ప్రోమో సాంగ్ ద్వారా మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు. 24 గంటలు కాకముందే ఇప్పటి వరకు 29 లక్షలు వ్యూస్ వచ్చాయి. లక్షా అరవై ఆరు వేలకు పైగా లైక్ చేసారు. ఇంత వరకు ఏ హీరో క్రియోట్ చేయలేని రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. మా బన్నీ ఇక్కడ.. తగ్గేదే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed