‘వెంట వెంటనే మార్చేయడానికి వాడు ఫ్రెండ్ కాదు’.. ఫైమాపై స్టార్ నటుడు షాకింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-03-29 07:28:18.0  )
‘వెంట వెంటనే మార్చేయడానికి వాడు ఫ్రెండ్ కాదు’.. ఫైమాపై స్టార్ నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘పటాస్’ షో తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ సొంత ఇమేజ్‌ను సంపాదించుకుంది కమెడియన్ ఫైమా. తర్వాత తన అద్భుతమైన టాలెంట్ తో ఫైమా జబర్దస్త్ లో అవకాశం కొట్టేసింది. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ.. తన కమెడీతో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు సొంతం చేసుకుని.. ఏకంగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్ 6 వ సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో కూడా తోటి కంటెస్టెంట్లను నవ్విస్తూ.. మరింత క్రేజ్ దక్కించుకుంది.

ఇక పటాస్ ప్రవీణ్-ఫైమా లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ఈమె పటాస్ షో లో పాల్గొన్నప్పటి నుంచి ప్రవీణ్ తో ప్రేమాయణం కొనసాగిస్తోందని టాక్. ఈ విషయాన్ని వీరిద్దరు స్వయంగా వెల్లడించారు. ఫైమా-పటాస్ జంటగా యూట్యూబ్ లో వీడియోలో కూడా చేశారు. వీరి ప్రేమ విషయాన్ని బిగ్‌బాస్ హౌస్ లో కూడా చాలా సార్లు ప్రస్తావించి, కన్ఫర్మ్ చేసింది.

ఇంతా క్లోజ్ గా మూవ్ అయిన ప్రవీణ్-ఫైమాకు ఏమైందో తెలియదు కానీ.. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ చేసిన కామెంట్లు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ‘వెంట వెంటనే మార్చేయడానికి వాడు ఫ్రెండ్ కాదు’ అంటూ భాస్కర్.. ఫైమాకు పంచ్ విసురుతాడు. దీంతో నెటిజన్లు.. ఫైమా, ప్రవీణ్ ను వదిలేసి వేరే పర్సన్ తో రిలేషన్ లో ఉందని బుల్లెట్ భాస్కర్ డైరెక్ట్ గా చెప్పాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

ఘనంగా బర్రెలక్క రెండో వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోస్

Advertisement

Next Story