Brahmamudi september 06: మొదటి సారి కావ్యను ముద్దుగా పొగిడిన రాజ్

by Prasanna |   ( Updated:2023-09-06 07:14:56.0  )
Brahmamudi september 06: మొదటి సారి కావ్యను ముద్దుగా పొగిడిన రాజ్
X

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

రాజ్ ఆఫీస్‌కి రెడీ అయ్యి.. కిందకు వస్తాడు. అందరూ హాల్లో ఉంటారు. టిఫిన్ అయిందా.. అంటూ రాజ్ అడగగా.. ‘అయ్యో పది నిమిషాలండి’ అంటుంది కావ్య. ‘ ముగ్గు గురించి పొగిడే సరికి దీనికి కొమ్ములు వచ్చేసాయని రాజ్ అనుకుంటాడు. ఇదే మంచి సమయం అనుకుని అత్తగారు రెచ్చిపోయి .. ‘ఏం వాడు ఆఫీస్‌కి వెళ్తాడని తెలుసు కదా..మరి అంత నిర్లక్ష్యమా?’ అని అంటుంది. ‘కావ్యది ఏం లేట్ చేయలేదు.. మన వాడే త్వరగా వచ్చాడని సుభాష్ అంటాడు.

ఫర్వాలేదు మమ్మీ.. నేను కొంచెం త్వరగా ఆఫీస్‌కి వెళ్లాలి.. నేను వెళ్తానంటూ రాజ్ వెళ్లబోతాడు. అయ్యో టిఫిన్ అయిపోవచ్చిందండి అంటూ కావ్య. ‘అమ్మా కావ్యా.. లేట్ అవుతుందని నువ్వు ఏమి కంగారు పడొద్దు.. టైమ్ అవుతోందని నువ్వు కూడా కంగారు పడొద్దు రాజ్.. మీ ఆవిడ బాక్స్ తీసుకుని నీ దగ్గరకు వస్తుందంటూ సీతారామయ్య అంటాడు. ‘అబ్బే తనకెందుకు శ్రమా’ అంటూ భార్య మీద ప్రేమను చూపిస్తూ, నాటకం స్టార్ట్ చేస్తాడు రాజ్.

ఇవి కూడా చదవండి: Sreeleelaకు బిగ్ షాక్.. ఆమె కెరీయర్లో అనౌన్స్ మెంట్ చేశాక ఆగిపోయిన మొదటి సినిమా ఇదే..!

Advertisement

Next Story

Most Viewed