Brahmamudi Today: అందాల బొమ్మను చూసి పడిపోయిన రాజ్

by Prasanna |   ( Updated:2024-02-05 14:56:44.0  )
Brahmamudi Today: అందాల బొమ్మను చూసి పడిపోయిన రాజ్
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

డిజైన్స్ గురించి రాజ్.. శ్రుతిని ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఉండగా.. కళావతి అప్పుడే కారులోనుంచి దిగుతుంది. ఒక్కసారిగా ఆఫీసులో ఉన్న వారందరూ షాక్ అవుతారు. రాజ్ కూడా తొంగి తొంగి చూస్తాడు. కళావతి కారు నుంచి దిగడం, ఆమె స్టైలుగా నడిచి రావడం అంతా సూపర్ గా ఉంటుంది. కళావతి అందానికి బిత్తరపోయి. అలానే చూస్తూనే ఉండిపోతాడు. చేతిలోని పేపర్స్ కూడా కిందపడిపోతాయి. ఏంటి ‘పడిపోయారా?’ అని కళావతి అంటుంది. ‘ఏంటీ?’ అని రాజ్ కోపంగా ముఖం పెడుతూ కవర్ చేసుకుంటూ ఉంటాడు.

‘అదే పేపర్స్ పడేసుకున్నారా అని అంటున్నాను.. అంతకుమించి నేను ఏమి మాట్లాడలేదు అని కావ్య అంటుంది. శ్రుతి ఆ పేపర్స్ అన్నీ ఏరి.. కళావతి అందాన్ని ఒక రేంజ్ లో రాజ్ అక్కడ ఉండగానే పొగుడుతుంది. రగిలిపోతాడు రాజ్. ‘హేయ్..ఆపుతావా .. నీకు డిజైన్స్‌లో మార్పులు ఎలా చేయాలో ఇందాక చెప్పాను కదా.. ముందు వెళ్లి ఆ పని చూడు’ అంటూ శ్రుతిని తిట్టి పంపిచేస్తాడు రాజ్. ఇక రాజ్ వెనుకే కావ్య నడుస్తూ ఉండగా.. ఆఫీస్‌లో కొంతమంది అమ్మాయిలు.. ‘మీ లుక్ అదిరింది మేడమ్’ అని అంటారు.అవునా మీ అందరికీ స్పెషల్ థాంక్స్ అని కళావతి చెబుతుంది. కళావతి ఇక తిప్పుకుంటూ రాజ్ వెనుకే.. రాజ్ క్యాబిన్‌కి వరకు వెళ్తుంది.

‘మీరు నన్ను ఎలా చూడాలనుకున్నారో అలాగే తయారయ్యాను కదా.. ? బాగున్నానా?’ అని కళావతి అంటుంది. నీ మొఖం లా ఉన్నావ్ .. ‘ఇంటి నుంచి బయటికి మన వీధి చివరన కుక్కలేం వెంటపడలేదా?’ అని రాజ్ అంటాడు. ‘ఊ.. మీరు జలసీతో ఇలా మాట్లాడుతున్నారు కానీ.. మనసులో మీరు మంచిగానే అనుకున్నారు కదా ?’అంటుంది కావ్య నవ్వుతూ. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Read More..

Guppedantha Manasu: రిషి చనిపోయాడు.. ఇదిగో ఆధారం అంటూ.. టీషర్ట్ ఇచ్చిన ముకుల్

Advertisement

Next Story