ఆ సిరీస్‌లో దళిత స్త్రీ ప్రతిఘటన.. ప్రశంసిస్తూ అంబేడ్కర్ మనవడి ట్వీట్

by Prasanna |   ( Updated:2023-08-17 12:38:11.0  )
ఆ సిరీస్‌లో దళిత స్త్రీ ప్రతిఘటన.. ప్రశంసిస్తూ అంబేడ్కర్ మనవడి ట్వీట్
X

దిశ, సినిమా : ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. స్త్రీలు, వారి వివాహ జీవితంపై ప్రధానంగా సాగే ఈ ప్రాజెక్ట్.. సమాజంలో మహిళలు పడే బాధలను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఈ క్రమంలోనే ఈ సీజన్ 5వ ఎపిసోడ్‌ను చూసి ఇంప్రెస్ అయినట్లు తెలుపుతూ ట్వీట్ చేశాడు బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్. ‘పల్లవి అనే దళిత స్త్రీ పాత్ర ధృవీకరణ, ప్రతిఘటన, ధిక్కరణ నాకు బాగా నచ్చింది. ఎపిసోడ్‌ను వీక్షించిన వంచితులు, బహుజనులారా.. మీ గుర్తింపును నిర్ధారించండి. అప్పుడే మీరు రాజకీయ ప్రాధాన్యతను పొందుతారు. పల్లవి చెప్పినట్లుగా.. ఎవ్రీథింగ్ ఈజ్ ఎబౌట్ పాలిటిక్స్. జై భీమ్’ అంటూ పిలుపునిచ్చాడు. కాగా పల్లవి పాత్రలో రాధికా ఆప్టే నటించగా.. ఈ ట్వీట్‌పై స్పందించిన డైరెక్టర్ నీరజ్ ఘైవాన్.. ‘దిస్ ఈజ్ ఎవ్రీథింగ్. థాంక్యూ సో మచ్, సార్’ అని తెలిపాడు.

Advertisement

Next Story