‘Boys Hostel’ ట్రైలర్..

by Dishaweb |   ( Updated:2023-10-10 16:52:48.0  )
‘Boys Hostel’ ట్రైలర్..
X

దిశ, సినిమా: ఈ ఏడాది కన్నడ బ్లాక్‌ బస్టర్ చిత్రాలలో ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’ ఒకటి. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ పుల్ క్రేజీ కామెడీ మూవీ... చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఇదే చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో ఆగస్టు 26న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ‘బేబి’ టీమ్ విడుదల చేసింది. కాగా ‘అద్దంలోని వస్తువులు మనకు కనిపించే దానికంటే దగ్గరగా ఉంటాయి. రియాలిటీలో కొందరు వ్యక్తులు మనకు కనిపించే దానికంటే తెలివితక్కువవారు’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం కాగా .. ఇందులో అందరిలాగే హాస్టల్ లైఫ్‌ను జాలీగా ఎంజాయ్ చేస్తున్న నలుగురైదుగురు కుర్రాళ్లు, స్ట్రిక్ట్‌గా ఉండే వార్డెన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో వాళ్లు వార్డెన్‌ను చంపేశారా? ఆ మర్డర్‌తో నిజంగానే వారికి సంబంధం ఉందా? అనే విషయాన్ని ఫుల్ లెంత్ కామెడీతో తెరకెక్కించారు. ఇక హాట్ యాంకర్ రష్మీ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి : బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టని స్టార్ హీరో.. ఆస్తి వేలం.. పేపర్ ప్రకటనతో ఫ్యాన్స్ షాక్

Advertisement

Next Story