Sunny Leone కు తప్పిన ప్రమాదం.. ఫ్యాషన్‌ షో సమీపంలో భారీ బాంబు పేలుడు!

by Satheesh |   ( Updated:2023-02-04 11:06:17.0  )
Sunny Leone కు తప్పిన ప్రమాదం.. ఫ్యాషన్‌ షో సమీపంలో భారీ బాంబు పేలుడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో బాంబు పేలుడు సంభవించింది. శనివారం ఉదయం ప్రముఖ నటి సన్నీలియోన్ హాజరుకావాల్సిన ఫ్యాషన్ షో సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ ఫ్యాషన్​షో అర్ధాంతరంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సన్నీలియోన్ ఆదివారం ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. ఈ పేలుడు ఘటనలో ఎవరికి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని ఇంఫాల్ ఈస్ట్​ఎస్పీ మహారాబం ప్రదీప్ సింగ్ తెలిపారు.

ఇంఫాల్‌లోని హప్తా కాంగ్జేబుంగ్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. శనివారం ఉదయం 6.30 ప్రాంతంలో ఫ్యాషన్ షో వెన్యూకు 100 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది ఐఈడీ పేలుడా లేక గ్రెనేడ్ పేలుడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత తీసుకోలేదని ప్రదీప్ సింగ్ వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : ఒకే అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు రాపర్లు మృతి..

Advertisement

Next Story

Most Viewed