గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్

by Kavitha |
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree leela) జంటగా నటిస్తోన్న సినిమా ‘రాబిన్ హుడ్’(Robin Hood). ఈ చిత్రానికి వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యేర్నెని(Naveen Yarneni), రవిశంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. అయితే కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా.. రీసెంట్‌గా పోస్ట్‌పోన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ లేటెస్ట్ పోస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

నేడు క్రిస్మస్ సందర్భంగా.. హీరో నితిన్ శాంటాక్లాజ్ లుక్‌లో ఓ బాలుడికి గిఫ్ట్ ఇస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘టీమ్ రాబిన్ హుడ్ నుండి మీకు క్రిస్మస్(Merry Christmas) శుభాకాంక్షలు. హో హో హో మా శాంటా త్వరలో పెద్ద స్క్రీన్‌లపై వినోదాన్ని అలరించడానికి రానున్నాడు. ఈ పండుగను ఆస్వాదించండి, అలాగే హాలిడే సీజన్‌ను కూడా ఎంజాయ్ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ సినిమా కనుక ఈ రోజు రిలీజై ఉంటే మేమందరం థియేటర్లలో ఎంజాయ్ చేస్తుండే వాళ్ళము అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed