‘పుష్ప 2’ను టార్గెట్ చేసిన బాలీవుడ్.. బాయ్‌కాట్ చెయ్యాలంటూ ప్రచారం

by Prasanna |   ( Updated:2023-04-11 05:33:06.0  )
‘పుష్ప 2’ను టార్గెట్ చేసిన బాలీవుడ్.. బాయ్‌కాట్ చెయ్యాలంటూ ప్రచారం
X

దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప2’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ 5 భాషల్లో రిలీజ్ కాగా, హిందీలో ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంది. ఇందులో పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో కనిపించిన పోస్టర్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ గెటప్‌లో పుష్పరాజ్ తుపాకీ పట్టుకోవడంపై బాలీవుడ్ ట్విట్టర్ పేజీ విమర్శలు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారుతోంది. ఇందులో భాగంగా ఆ విమర్శలకు బన్నీ ఫ్యాన్స్ తగ్గేదే లే.. అన్నటు ధీటుగా బదులిస్తున్నారు. ‘శత్రు సంహారం చేయడానికి ఎంతో మంది దేవతలు, దేవుళ్ళు ఆయుధాలు పట్టారు అలాగే ఈ తుపాకీ కూడా. ప్రతిదీ వివాదం చేయకండి. మీరు బాయ్‌‌కాట్ అంటూ ఎంతలా ప్రచారం చేసినా ఆ ఎఫెక్ట్ ‘పుష్ప’ పై ఏ మాత్రం ఉండదు’ అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Read more:

సమంత కారణంగా అక్కినేని ఫ్యామిలీలో గొడవలు?

Advertisement

Next Story