‘శృంగారంలో నేను నా కుమార్తెలు PhD చేశాం’.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Anjali |
‘శృంగారంలో నేను నా కుమార్తెలు PhD చేశాం’.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా సుస్మితా సేన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ హీరోయిన్ చిత్రాలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని గొప్ప మనసు చాటుకుంది. ఇక ఈ బ్యూటీ ఎంతో మందితో డేటింగ్ చేసినట్లు తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఎవరిని జీవిత భాగస్వామిగా యాక్సెప్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే సుస్మితా సేన్ సమాజంలో మహిళలు ఎదుర్కొంటోన్న అపోహాలు, సమస్యలపై అవగాహన తెప్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్ షోలో పిల్లలకు శృంగారం ఎడ్యుకేషన్ గురించి తెలియాలంటూ చెప్పుకొచ్చింది. నేటి పిల్లలకు దానిపై అవైర్‌నెస్ కల్పించాలని తల్లిదండ్రులందరికీ సలహా ఇచ్చింది. చిన్న వయసులోనే శృంగారంపై అవగాహన కల్పిస్తే మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకుంటారని తెలిపింది. ఈ క్రమంలోనే సుస్మితా సంచలన కామెంట్స్ చేసింది. తను కూడా తమ పిల్లలకు ఈ టాపిక్ గురించి తరచూ చెబుతూనే ఉంటానని వెల్లడించింది.

సుస్మితకు అండ్ తన కుమార్తెలకు శృంగారం గురించి ఎవరూ స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదని తెలిపింది. అది తెలుసుకోవడంలో ఇప్పటికే వాళ్లు పీహెచ్‌డీ చేశారని పేర్కొంది. ప్రస్తుతం మాజీ విశ్వసుందరి కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు లవర్స్‌ను మారుస్తుంటుంది. పిల్లల్ని కూడా అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి క్లాస్ ఇస్తుందా? అంటూ విమర్శించగా.. మరికొంతమంది పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed