ఆ హీరో ఊపిరాడనియకుండా గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు.. కోర్టులో కేసు వేశా: స్టార్ హీరోయిన్

by Disha Web Desk 9 |
ఆ హీరో ఊపిరాడనియకుండా గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు.. కోర్టులో కేసు వేశా: స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: 1969లో ‘అంజనా’ అనే బెంగాలీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ నటి రేఖ. ఈ సినిమాలో రేఖ కన్నా 20 ఏళ్లు పెద్దైన బిస్వజిత్ చటర్జీ హీరోగా నటించాడు. అయితే అప్పట్లో బాలీవుడ్ లో అంతగా ముద్దు సన్నివేశాలు తీయడం లేదట. ఏదో ఒక సినిమాలో మాత్రమే రేర్ గా కనిపించేవి. కానీ ఈ చిత్ర షూటింగ్ సమయంలో హీరో బిస్వజిత్.. రేఖను ఊపిరాడనియకుండా బలవంతంగా పట్టుకుని కిస్ పెట్టారట.

దీంతో రేఖ గట్టిగా అరిచి ఏడ్చేసిందంట. ఈ వివాదంతో కోర్టు వరకు వెళ్లిందట. దీంతో సెన్సార్ వాళ్లు ఈ ముద్దు సీన్ ను తీసేయమని చెప్పారట. రేఖకు ఇక్కడ బాగా బాధ కలిగించిన విషయమేంటంటే? హీరో ఆమెకు బలవంతంగా కిస్ పెడుడుతుంటే, సెట్ లో ఉన్నవాళ్లంతా చప్పట్లు కొడుతూ.. విజిల్స్ వేశారట. ఆ సమయంలో ఈ హీరోయిన్ చాలా బాధపడిందట.

ప్రస్తుతం రేఖ ఒంటరిగానే జీవిస్తుందని సమాచారం. భర్త చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ నుదుటిన కుంకుమ పెట్టుకుని, ఒంటినిండా చీర కట్టుకుని ఎంతో పద్ధతిగా కనిపిస్తుంటుంది. 60 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది.


Next Story