- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి అత్యంత కీలక హామీపై చేతులెత్తేసిన జగన్.. నెటిజన్ల ఫైర్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక హామీపై చేతులెత్తారు. 2014కు ముందు చంద్రబాబుపై ఆ ఆయుధాన్ని బలంగా ప్రయోగించారు. ఇప్పుడు అసలు ఆ హామీ ప్రస్తావన లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ప్రజాకర్షక హామీలు ప్రకటించారు. కానీ అతి ముఖ్యమైన, కీలక అంశాన్ని వదిలేశారు. అదే ఏపీ ప్రత్యేక హోదా. ఏపీ పునర్య్వస్థీకరణలో భాగంగా రాష్ట్రానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్ల పాటు ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం మారింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. అయితే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్రాకేజీ ఇస్తామంటూ ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రాకేజీలో భాగంగా రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా విడుదల అయింది.
అయితే అప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారంటూ విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదాను ఓ ఆయుధంగా మార్చుకున్నారు. 25 ఎంపీ సీట్లు తనకు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ హామీ ఇచ్చారు. జగన్ చెప్పిన మాట విని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 ఎంపీ స్థానాలు, 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా రాలేదు. రాష్ట్రంపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాలేదని.. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూనే ఉంటామని చెప్పారు. కానీ డిమాండ్ చేస్తామని మాత్రం హామీ ఇవ్వలేదు.
ఇప్పుడు మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో అసలు ప్రత్యేక హోదా ఊసే లేదు. కనీసం ప్రత్యేక హోదా అవసరమనే విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. నవరత్నాల్లో భాగంగా ఇస్తున్న డబ్బులను రెట్టింపు చేస్తూ పోతామని మాత్రమే చెప్పారు. కానీ ప్రత్యేక హోదాపై చిన్న ప్రకటన కూడా చేయలేదు. 2014లో చాలా కీలకమైన డిమాండ్ ఉన్న ప్రత్యేక హోదా.. 2024కు వచ్చే సరిగా కనుమరుగులేకుండా చేసేశారు. దీంతో ఏపీ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అధికారంలో లేకపోతే అలా.. ఉంటే ఇలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లి కూడా ఇలా రంగులు మార్చదేమోనని కామెంట్స్ చేస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేయాలంటే జగన్ వల్లే సాధ్యమంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ప్రత్యేక హోదాలాంటి కీలక డిమాండ్‌పై చేతులెత్తేసిన జగన్‌కు ఈసారి ఏపీ ప్రజలు మళ్లీ పట్టం కడతారేమో చూడాలి.
Read More..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వైసీపీ మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలు