మే మొదటి వారంలో ఈ మూడు రాశుల వారికి అదృష్టం.. మీ రాశి ఉందో చూడండి!

by Disha Web Desk 8 |
మే మొదటి వారంలో ఈ మూడు రాశుల వారికి అదృష్టం.. మీ రాశి ఉందో చూడండి!
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వలన ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అయితే మే మొదటి వారంలో బృహస్పతి వృషభ రాశిలోకి, చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈ వారం అదృష్ట వారంగా చెప్పవచ్చు. ఈ నెల ప్రారంభం వీరికి చాలా సంతోషంగా గడిచి పోతుంది. అంతే కాకుండా చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ధనయోగం కలిగే అవకాశం ఉంది. అకస్మికంగా ధనం చేతికందుతుంది. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. పెద్దలు, పిల్లలు ఆనందంగా ఉంటారు.

మిథున రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగంలో కలిసి వస్తుంది. నిరుద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి మే నెల మొదటి వారం కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చు. ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యాపారస్థులు మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన నెరవేరుతుంది. రుణ సమస్యల నుంచి బయటపడుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొంది చాలా సంతోషంగా ఉంటారు. దైవక్షేత్రాలు సందర్శించడం వలన చాలా హ్యప్పీగా ఉంటారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.(నోట్ : ఇది ఇంటర్నెట్‌లో సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు. ఇది వారి వారి నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది.



Next Story