సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి?

by sudharani |   ( Updated:2023-04-17 13:07:26.0  )
సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి?
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆప్ నేత రాఘవ్ చద్దాతో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జంట చాలాసార్లు ముంబై, ఢిల్లీ విమానాశ్రయంలో కలిసి కనిపించడంతో అభిమానులు కూడా నిజమే అంటున్నారు. కానీ, ఈ రూమర్స్‌పై ఇప్పటి వరకు వారిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే.. ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో పరిణీతి చేతికి ఉంగరం కనిపించడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఇప్పటికైనా ఈ జంట స్పందిస్తారా లేదా అనే అతృతతో నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

Also Read..

అలా చేయడం కోసం స్టార్ హీరోయిన్ అబార్షన్..? ఆసక్తిరేపుతున్న ట్వీట్

Advertisement

Next Story