బాలీవుడ్ డైరెక్టర్ యష్ చోప్రా భార్య కన్నుమూత!

by Anjali |
బాలీవుడ్ డైరెక్టర్ యష్ చోప్రా భార్య కన్నుమూత!
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా 74 కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. పమేలా 1970లో యశ్ చోప్రాను వివాహం చేసుకుంది. వీరికి ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. పమేలా చోప్రా సుప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయని. దీంతో పాటుగా పలు సినిమాల్లో పాటలు పాడిన ఆమె యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇక విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story