వెకేషన్‌ ట్రిప్‌లో వేడి పుట్టిస్తున్న మౌని రాయ్.. ఎంజాయ్ మామూలుగా లేదుగా..

by Javid Pasha |   ( Updated:2024-05-27 16:28:53.0  )
వెకేషన్‌ ట్రిప్‌లో వేడి పుట్టిస్తున్న మౌని రాయ్.. ఎంజాయ్ మామూలుగా లేదుగా..
X

దిశ, సినిమా : నటి మౌని రాయ్ అందరికీ సుపరిచితమే. స్మాల్ స్క్రీన్ పరిశ్రమ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకుంది. తన నటన, అందం, అభినయంతో ఆకట్టుకుంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన అపేడేట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న బోల్డ్ ఫొటో షూట్లను ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.

అసలే సమ్మర్, వేడి విపరీతంగా ఉన్నందున చల్లటి వెకేషన్‌‌ను ఎంచుకొన్నానంటున్న మౌని రాయ్, బికినీలో అందాలు ఆరబోస్తూ.. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు కూల్ వెదర్‌లో హీట్ పుట్టిస్తున్నావంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇందంతా పక్కన పెడితే.. మౌని రాయ్ గత సంవత్సరం వచ్చిన బ్రహ్మాస్త్రం మూవీలో మెరిసి అలరించింది. ఈ చిత్రంలో అలియా భట్, రణ్ బీర్ కపూర్, అబితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ దిశా పఠాని, మౌని రాయ్ మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ రెగ్యులర్‌‌గా వివిధ వెకేషన్లలో కలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలోనూ పోటీ పడుతుంటారు.

Read More...

నువ్వు అలా ఉంటేనే నాకు నచ్చుతావ్ అంటూ శ్రీముఖికి లవ్ ప్రపోజ్.. పెళ్లి గురించేనా?


Advertisement

Next Story