మేకప్ లేకుండా ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బాలీవుడ్ నటి

by Anjali |   ( Updated:2023-03-21 10:05:16.0  )
మేకప్ లేకుండా ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బాలీవుడ్ నటి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) దక్షిణాది సినిమాల్లో ఎక్కువగా నటించకున్నా, తరచూ సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో నెటిజన్లను మైమరపిస్తూనే ఉంటుంది. సాహో చిత్రంలో ఐటెమ్ సాంగ్‌కు ప్రభాస్‌తో కలిసి అదరగొట్టే స్టెప్పులు వేసి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. గతేడాది వచ్చిన బ్లాక్ బాస్టర్ ‘రా రా రక్కమ్మ’ సాంగ్‌తో కూడా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాట హిట్‌తో కావడంతో సౌత్ ఆడియెన్స్ దగ్గర ఈ భామ మంచి క్రేజ్ దక్కించుకుంది. తాజాగా జాక్వెలిన్ మేకప్ లేని సెల్ఫీ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలకు నెటిజన్లు, తన ఫాన్స్ మేకప్ లేకున్నా చాలా బ్యూటీఫుల్‌గా ఉన్నావంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే జాక్వెలిన్ తన బాడీ ఫిట్ నెస్ కోసం కఠిన ఆసనాలు వేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే... జాక్వెలిన్ రీసెంట్‌గా ‘సెల్ఫీ’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ‘క్రాక్’, ‘ఫతే’ సినిమాల్లో నటిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాలతో ఈ గ్లామరస్ గర్ల్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

Also Read: షూటింగ్ టైమ్‌లో ఆ పని చేయాలంటే బండరాళ్లే దిక్కు: కంగన షాకింగ్ కామెంట్స్





Read more:

ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు

Advertisement

Next Story