హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. అలా చేయడం బాధాకరమంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-08-28 14:29:13.0  )
హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. అలా చేయడం బాధాకరమంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు బాడీ షేమింగ్ గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలను కొందరు సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ అవుతుంటారు. తాజాగా, బాలీవుడ్ హీరో రణ్‌దీప్ భార్య కూడా బాడీ షేమింగ్ గురైంది. ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టి ఆడవాళ్లే శత్రువులుగా మాట్లాడారంటూ ఎమోషనల్ అయింది. రణ్‌దీప్ హుడా గత ఏడాది మోడల్, నటి లిన్ లైష్రామ్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో నటిస్తుండగా.. లిన్ చేనేత కార్మికులకు సహాయం చేస్తూ వారు తయారు చేసిన దుస్తులతో ర్యాంప్ వాక్ చేస్తోంది.

ఈ క్రమంలోనే ఆమెను కొందరు నెట్టింట ట్రోల్ చేశారు. లావుగా ఉన్నావంటూ దారుణంగా కామెంట్లు పెట్టారు. దీనిపై లిన్ రియాక్ట్ అవుతూ.. ‘‘ కొందరు నా బరువు గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మహిళలే అలా చేయడం జోకులు చేయడంతో చూసి ఫాకయ్యాను. నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కామెంట్లు చేసే ముందు వాళ్లు నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు తెలిసేది. నేను లావుగా ఉన్న కానీ ర్యాంప్‌పై వారి ఊహకు అందరి విధంగా కనిపించి మెప్పించాను. ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువు అనే సామెతని నిజం చేస్తూ కామెంట్లు చేయకండి. దానికి బదులు ఒకరికొకరు అండగా ఉండటం, లేదా సపోర్ట్ చేయడం వంటివి చేస్తే మంచిది’’ అని రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed