- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bommarillu: ఇట్స్ అఫీషియల్.. బ్లాక్ బస్టర్ సినిమా ‘బొమ్మరిల్లు’ రీరిలీజ్
దిశ, సినిమా: సిద్ధార్థ్ (Siddharth), జెనీలియా (Genelia)ల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బొమ్మరిల్లు (Bommarillu)’. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించాడు. 2006లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా అప్పట్లో యూత్‌కు ఈ మూవీ బాగా కనెక్ట్ అవ్వడంతో పాటు.. ఆల్ టైమ్ ఫెవరెట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్స్, లవ్ యాంగిల్, సాంగ్స్ అన్నీ కూడా వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. దీంతో అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఈ సినిమా విజయంతోనే డైరెక్టర్ భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారింది. అలాంటి అద్భుతాన్ని సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘X’ ఖాతా ద్వారా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘ఈ సినిమా ఎప్పటికీ మసకబారదు.. ఆ ఆనందాన్ని పంచడానికి వచ్చేస్తున్నాం.. కుదిరితే కప్ కాఫీ సెప్టెంబర్ 21న మళ్లీ థియేటర్స్‌లో’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. యూత్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.