- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్త్ డే వేళ NTR హార్ట్ టచింగ్ ట్వీట్.. మరోసారి మనసులు గెల్చుకున్న తారక్
దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నాని తదితరులు ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మాజీ మంత్రి నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తనపై ఎనలేని ప్రేమ చూపిస్తూ ఆదిరిస్తోన్న సహచరులు, అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ హార్ట్ టచింగ్ పోస్ట్ పెట్టారు. తనకు బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
‘డియర్ ఫ్యాన్స్.. నా ప్రయాణం మొదలైన తొలి రోజు నుంచి మీరు నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. అసామాన్యమైన మీ ప్రేమకు నేను ధన్యుడిని. దేవర సినిమాలోని పాటకు మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు అందరికీ ధన్యవాదాలు’ అని ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్ పెట్టారు. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటేస్ట్ దేవర. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఆదివారం మూవీ యూనిట్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట్‌ర్ అనిరుధ్ పాడిన ఈ పాట మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుట్టుంది.