మీ వల్గర్ కామెంట్స్ నన్ను ఏమీ చేయలేవ్.. ట్రోలర్స్‌కు క్లాస్ ఇచ్చిన బిపాస

by Prasanna |   ( Updated:2023-10-02 14:02:02.0  )
మీ వల్గర్ కామెంట్స్ నన్ను ఏమీ చేయలేవ్.. ట్రోలర్స్‌కు క్లాస్ ఇచ్చిన బిపాస
X

దిశ, సినిమా: గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రస్తుతం మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తు్న్న బాలీవుడ్ నటి బిపాసా బసు సోషల్ మీడియా ట్రోలింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బిడ్డ పుట్టిన తర్వాత బరువు పెరగడంపై విమర్శలు చేశారని చెప్పింది. ‘ట్రోలర్స్‌కు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీరు ఇలాగే విమర్శలు చేసుకోండి. నేను ఇలాంటి వాటికి భయపడను. బాధపడను. ఎందుకంటే మీ కామెంట్స్ నేను అసలే పట్టించుకోను. ఎందుకంటే ఇప్పడు నా దృష్టిమొత్తం నా బిడ్డపైనే. నా కూతురు దేవి మా జీవితంలోకి రావడంతో మా లైఫ్ మారిపోయింది. ఆమెను వదిలి ఒక్క క్షణం బయటకు వెళ్లలేకపోతున్నా. తనతోనే టైమ్ గడిపేస్తున్నా. పాప గుండెకు ఏర్పడిన హోల్స్ సర్జరీ చేయించేవరకూ ప్రతి సెకను కఠినంగా గడిచింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంది. నాకు సాయం చేసిన తల్లులకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story