- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి శ్వేతా వర్మ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొని తన పాపులారిటీని పెంచుకుంది. తాజాగా, శ్వేతా ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆమెత న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయింది. ‘‘ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో రూమ్ మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీతో పాటు.. నా పెట్స్ కూడా సేఫ్‌గానే ఉన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. దయచేసి నా కోసం మీరు ప్రార్థించండి. ఆందోళన వద్దు. మేము ఇప్పుడు క్షేమంగానే ఉన్నాము. కొద్దిరోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియా ద్వారా మీకు టచ్‌లోకి వస్తాను’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు జాగ్రత్తగా ఉండండి అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ ప్రియ స్పందించి ‘నేను ఎప్పుడూ నీ గురించి ప్రార్థిస్తాను శ్వేతా’ అని రాసుకొచ్చింది.