రాముడు అయోధ్యలోనే ఉంటాడా? కరోనా కంటే డేంజర్ వ్యాధులొస్తాయి: బిగ్‌బాస్ శివాజీ

by Anjali |   ( Updated:2024-01-18 04:56:46.0  )
రాముడు అయోధ్యలోనే ఉంటాడా? కరోనా కంటే డేంజర్ వ్యాధులొస్తాయి: బిగ్‌బాస్ శివాజీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు శివాజీ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈయన అయోధ్య రామ మందిరాన్ని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అయోధ్యలో ఉన్నదే రామ మందిరమం అంటారా? అయోధ్యలోనే రాముడు ఉంటాడా? మా గ్రామంలో కూడా రాముడి గుడి ఉంది. ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. భారతీయ జీవన విధానమే రామ తత్వం. కానీ పలు పొలిటికల్ పార్టీలు తమ అవసరాలు, అవకాశాల కోసం ఇలాంటివి వాడుకుంటారు. మనుషుల కంటే ప్రకృతే గొప్పది. అది దూల తీర్చేస్తుంది.

మనుషుల వల్ల కాని మార్పు ప్రకృతి తీసుకొస్తుంది. మనుషులు చేసే తప్పులను ప్రకృతి బ్యాలన్స్ చేస్తుంది. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అందరూ గజగజ వణికిపోయారు. కరోనా కంటే ఇంకా దారుణమైన రోగాలు రావొచ్చు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మనుషుల్లో క్రూరత్వం అలా పెరిగిపోతుంది. కేవలం పైసే ముఖ్యమనుకుంటున్నారు. ఇక అప్పుడు దేవుడు వచ్చి.. అన్నింటిని సరిదద్దిపోతాడు’’. అంటూ శివాజీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Read More..

శివాజీకి నిజంగానే రెండో పెళ్లాం, కూతురు ఉన్నారా.. క్లారిటీ ఇచ్చిన హీరో!

Advertisement

Next Story