- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Big Boss 8 Promo Telugu: ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న బిగ్ బాస్ 8 ప్రోమో
దిశ, సినిమా: తెలుగు బుల్లి తెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు బిగ్ బాస్ పై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే అందరూ ఇది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేసారు. ఈ రోజు ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకులకు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ అందర్ని ఆకట్టుకున్నారు. మరి ఈ సారి ఎలాంటి ట్యాగ్ లైనుతో వచ్చారో ఇక్కడ చూద్దాం..
ఇక ప్రోమో గురించి మాట్లాడుకుంటే.. తెలుగు కమెడియన్ సత్యతో ఈ సారి సీజన్ 8 ప్రోమోని మొదలు పెట్టారు. సత్య ఒక దొంగలా వచ్చి వస్తువులన్ని తీసుకుపోదాం అనుకుంటాడు. ఇంతలో అక్కడ ఉండే ఒక దీపంలో కింగ్ నాగార్జున ప్రత్యక్షమవుతాడు. నీకు ఏమి కావాలో కోరుకో అని అంటాడు. ‘ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ లిమిటే లేదు’ అంటూ నాగార్జున సూపర్ డైలాగ్ చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచారు. అంటే ఇక్కడే తెలిసిపోతుంది ఈసారి కూడా అద్భుతంగ ఉండబోతుందని.. అంటే ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక అక్కడ ఇచ్చే టాస్కులు, చేసే పోరాటాలకు లిమిట్ లేదని చెబుతున్నారు. మీరు ప్రేక్షకులుగా ఒక్కసారి బిగ్ బాస్ ని చూడటం మొదలు పెడితే.. ఇక్కడ ఎంటర్ టైన్మెంట్, ఫన్ కి లిమిటే లేదని నాగ్ చెప్పకనే చెప్పేసారు.