Bigg Boss Season -8: నాగార్జునకు దిమ్మతిరిగే పారితోషికం.. రెంట్‌తో కలిపి మొత్తం ఎన్ని కోట్లంటే!

by Anjali |
Bigg Boss Season -8: నాగార్జునకు దిమ్మతిరిగే పారితోషికం.. రెంట్‌తో కలిపి మొత్తం ఎన్ని కోట్లంటే!
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకులంతా బిగ్‌బాస్ సీజన్-8 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ అన్ని మంచి రేటింగ్‌తో దూసుకుపోవడంతో నాగార్జున సీజన్-8 ను సరికొత్తగా షో ను డిజైన్ చేస్తున్నారు. జనాలకు కొత్త అనుభూతిని పంచేల ఎలిమినేషన్స్, టాస్క్స్, రూల్స్ గేమ్స్ ఉండనున్నాయని సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.ఇక హౌస్‌లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారనేది కూడా పలువురి పేర్లు నెట్టింట వినిపిస్తున్నాయి.

ప్రముఖ నటి సురేఖావాణి, సోనియా సింగ్, నటి హేమ, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, బర్రెలక్క, కుమారీ ఆంటీ, అమృత వర్షిణి, రీతూ చౌదరి, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్.. ఇలా కొంతమంది నేమ్స్ లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే సీజన్-8 కోసం నాగార్జున ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది బయటపడింది. బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. నాగార్జున 25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. దీంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బిగ్‌బాస్ సెట్‌కు అద్దె కూడా అందుతుందట. కాగా మొత్తం కలిపి కింగ్ నాగార్జునకు 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనున్నారట.

Advertisement

Next Story

Most Viewed