Bigg Boss Season-8: నెట్టింట వైరలవుతోన్న నాగ మణికంఠ పెళ్లి వీడియో

by Anjali |
Bigg Boss Season-8: నెట్టింట వైరలవుతోన్న నాగ మణికంఠ పెళ్లి వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్-8 ప్రారంభమై నిన్నటితో వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలో నామినేషన్స్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యింది. నామినేషన్స్‌లో శేఖర్ బాషా, పృథ్విరాజ్, బెజవాడ బేబక్క, విష్ణుప్రియ, నాగ మణికంఠ, సోనియా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో ఒకరు వచ్చే ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఇంటికి వెళ్లనున్నారు. ఇక విష్ణుప్రియ సెలబ్రిటీ కాబట్టి హౌస్‌ను వీడే అవకాశం లేదంటున్నారు ఫ్యాన్స్. పృథ్విరాజ్, శేఖర్ బాషా కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్నవారే. కాగా డేంజర్ జోన్‌లో ఉన్నది కేవలం నాగ మణికంఠ అండ్ సోనియా అని జనాలు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ట్రాన్సపరెంట్‌గా ఉండనేను బిగ్ బాస్ అంటూ నాగ మణికంఠ తన విగ్గును తీసి బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే నాగ మణికంఠ పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement

Next Story

Most Viewed