- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పల్లవి ప్రశాంత్.. ఒక్కో కుటుంబానికి ఎంత పంచాడంటే?
దిశ, సినిమా: అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్-7 వివాదాల మధ్య వివాదాలతోనే ముగిసింది. హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచారు. ఇక హౌస్ లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా అన్ని చూసుకున్న విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ను ముందు నుంచే ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు.
చివరకు రైతుబిడ్డ టైటిల్ విన్న అవ్వడంతో శివాజీనే కారణమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. అయితే టైటిల్ విన్నరైన ప్రశాంత్ రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. హౌస్ లో ప్రశాంత్ 35 లక్షల రూపాయలు రైతులకు పంచుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. షో ముగిసి 3 నెలలు దాటుతోన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే వాదన ఉంది. మాట తప్పాడు.. ఇంకెప్పుడు సహాయం చేస్తాడంటూ నెట్టింట విమర్శలు వినిపించాయి. ఈ పుకార్లను తిప్పికొట్టేలా ప్రశాంత్ తాజాగా ఓ పేద రైతు కుటుంబానికి అండగా నిలిచాడు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొలుగూరు గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి ప్రశాంత్ లక్ష రూపాయలు సాయం చేశాడు. పేద రైతు, అతడి భార్య చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. వారి పిల్లల పేరుపై ప్రశాంత్ పిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. అంతేకాకుండా పిల్లలకు ఏడాదికి సరిపడ బియ్యం అందజేశాడు. పల్లవి ప్రశాంత్ తో పాటు ఆట సందీప్ కూడా పిల్లలకు 25 వేల రూపాయలు సహాయం చేశాడు. మిగతా మనీ కూడా పేద ప్రజల కోసం పంచుతానని, సహాయం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని పల్లవి ప్రశాంత్ ఇన్ స్టా వేదికన తెలియజేశాడు.