- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బిగ్‌బాస్ ఫేమ్ Sohel ‘Mr. Pregnant’ సినిమా రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా?
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియారిలీ షో ద్వారా నటుడు సోహెల్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు ఓ కొత్త ప్రయోగంతో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా చేశాడు. దీనిని నూతన డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కిస్తుండగా.. రూపా కొడువయుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నేడు శుక్రవారం (ఆగస్టు-18) థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలిపారు.
కథ విషయానికి వస్తే.. హీరో అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగా పెరుగుతాడు. ప్రేమిస్తున్నాను అంటూ హీరోయిన్ వస్తుంది. ప్రెగ్నెన్సీ వల్లే అమ్మ చనిపోయిందని పిల్లలు వద్దంటేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన హీరోయిన్ ఓకే చెప్పడంతో ఒక్కటవుతారు. కానీ పెళ్లి తర్వాత హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ రావడంతో మొదట తిట్టి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తాను ఆ ప్రెగ్నెన్సీని తీసుకుంటాడు.
హీరో ప్రెగ్నెంట్ గా మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది కథ. మొదటి అరగంట క్యారెక్టర్స్ పరిచయం కోసం కొంచెం సాగదీసినట్లు ఉంటుందట. అదే సినిమాకు మైనస్ అని నెటిజన్లు అంటున్నారు. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఇక చివరి 40 నిమిషాలు మాత్రం అమ్మ గొప్పతనం, కొన్ని ఎమోషనల్ సీన్స్, ప్రెగ్నెన్సీ మహిళల కష్టాలు అన్ని చూపించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేశారు. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.
Also Read: 'Khushi' సినిమా కోసం Vijay Deverakonda రెమ్యునరేషన్ అన్ని కోట్లు తీసుకున్నాడా?