అప్పగింతల వరకు కూడా ఆగలేకపోయారా..?

by Hamsa |   ( Updated:2023-10-10 16:01:10.0  )
అప్పగింతల వరకు కూడా ఆగలేకపోయారా..?
X

దిశ, సినిమా : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో రిలీజ్ అయింది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న షో త్వరలో ప్రారంభం కాబోతోంది. కాగా ఇందుకు సంబంధించిన ప్రోమోలో.. ఆడపిల్ల పెళ్లి తర్వాత అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది. అయితే అప్పటి దాకా మా ఇంటి మహాలక్ష్మిని అత్తవారింటికి పంపించడం బాధగా ఉందమ్మా అంటూ కన్నీరుపెట్టుకుంటున్న తల్లిదండ్రులు.. బిగ్ బాస్ షో స్టార్ట్ కాగానే అందతా వదిలేసి టీవీకి అతుక్కుపోతారు.

ఇక అప్పుడే ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగ్.. 'అప్పగింతల వరకు కూడా ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే. బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్మెంట్‌కు అడ్డా ఫిక్స్' అంటూ ప్రేక్షకుల్లో హుషారెత్తించాడు. మొత్తానికి ప్రోమోతో ఖుష్ అవుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. ఇంకా వెయిట్ చేయలేకపోతున్నామని, ఇంతకీ కంటెస్టెంట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story