ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు వారానికి రూ. 12లక్షలు ఇస్తున్నారు.. ఇదిగో డిటెయిల్స్..

by sudharani |   ( Updated:2023-10-05 12:52:57.0  )
ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు వారానికి రూ. 12లక్షలు ఇస్తున్నారు.. ఇదిగో డిటెయిల్స్..
X

దిశ, సినిమా : దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే.. విక్కీ జెయిన్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే ఈ దంపతులు నెక్స్ట్ సీజన్ హిందీ బిగ్ బాస్‌ కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ మంత్ ఎండింగ్‌లో సీజన్ 17 స్టార్ట్ కాబోతుండగా.. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్, రెమ్యూనరేషన్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఈసారి హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ అంకితనే అని.. వారానికి రూ. 12లక్షలు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. పైగా భర్తతో కలిసి ఆడబోతున్న ఈ భామ.. ఇంట్లోకి వెళ్లే ముందు 200 అవుట్‌ఫిట్స్ తీసుకెళ్లబోతుందని సమాచారం. మొత్తానికి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షోను ఈ సారి మరింత డిఫరెంట్‌గా ప్లాన్ చేశారని టాక్.

Advertisement

Next Story