అక్కినేని అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. నేడు శోభిత ధూళిపాళతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్

by Kavitha |   ( Updated:2024-08-09 04:07:54.0  )
అక్కినేని అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. నేడు శోభిత ధూళిపాళతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటూ ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీ అయిపోయారు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళతో లవ్‌లో ఉన్నారనే ఓ పుకారు నెట్టింట షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వాళ్లిద్దరూ డేటింగ్​ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ గాసిప్స్​పై వాళ్లు ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అలాగని కొట్టిపారేయనూ లేదు. అలాంటి తరుణంలో తాజాగా చై-శోభిత రిలేషన్‌కు సంబంధించి మరో క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే?

నాగ చైతన్య స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నేడు వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది. కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులు, స్నేహితులతో పాటు కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది. అలాగే చైతూ-శోభిత ఎంగేజ్​మెంట్​పై ఈ కార్యక్రమం అనంతరం అక్కినేని నాగార్జున అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేస్తారని తెలిస్తోంది. దీంతో ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇది తెలిసిన అక్కినేని అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. చై ఓ ఇంటివాడు కాబోతున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎంగేజ్​మెంట్​పై అక్కినేని ఫ్యామిలీ లేదా శోభిత నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. మరి ఇది కూడా పుకారు లాగా మిగిలిపోతుందా.. లేదా నిజంగానే చేసుకుంటున్నారా అనే విషయం తెలియాలంటే మరికొంత సమయం వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story