Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. ‘రాజాసాబ్’ టీజర్ వచ్చేదప్పుడే?

by Anjali |
Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. ‘రాజాసాబ్’ టీజర్ వచ్చేదప్పుడే?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. చివరగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి 2898 (Kalki) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టిందనడంలో అతిశయోక్తిలేదు. తర్వాత మన రెబల్ స్టార్ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా వరుస షూటింగ్స్‌కు హాజరవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ రాజాసాబ్(Rajasab) మూవీతో పాటుగా హను రాఘవపూడి మూవీ(Hanu Raghavapudi movie) షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న టాక్. ఇకపోతే రీసెంట్‌గా రాజాసాబ్ చిత్రం నుంచి మాళవిక మోహనన్(Malvika Mohanan) ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి అయిందని.. మరికొన్న రోజులు మాత్రమే ఉందని నెట్టింట పోస్ట్ ద్వారా వెల్లడించింది.

అయితే హారర్ అండ్ ప్రేమ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ మూవీ ఏప్రిల్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లైతే.. మారుతీ డైరెక్షన్ లో రూపొందుతోన్న రాజాసాబ్ నుంచి ఈ నెల(డిసెంబర) క్రిస్మస్(Christmas) కానుకగా టీజర్ విడుదల చేయనున్నారంటూ నెట్టింట జనాలు చర్చించుకున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైం డిఫరెంట్ గెటప్‌లో నటిస్తుండడం.. అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. మరీ టీజర్‌పై త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నాని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed