- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్ : సినీ నటుడు శరత్ బాబు కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు శరత్ బాబు(71) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శరత్ బాబు జన్మించారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు అలరించారు.
దాదాపు 50 ఏళ్లలో 250కి పైగా సినిమాల్లో శరత్ బాబు నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో శరత్ బాబు వివిధ పాత్రల్లో నటించారు. 70కి పైగా చిత్రాల్లో హీరోగా శరత్ బాబు నటించారు. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎనిమిది నంది పురస్కారాలు అందుకున్నారు. వెండి తెర, బుల్లితెరలపై శరత్ బాబు తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు.
1981లో రమాప్రభను శరత్ బాబు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే రమాప్రభ, శరత్ బాబు విడిపోయారు. 1990లో స్నేహ నంబియార్ ని శరత్ బాబు వివాహమాడారు. స్నేహ నంబియార్ తోనూ శరత్ బాబు వివాహబంధం నిలవలేదు.
Read More: శరత్ బాబుకు గుర్తింపు తెచ్చిన చిత్రాలివే..