మహేష్ బాబుపై బిగ్‌బాస్ గీతూ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ (పోస్ట్)

by Hamsa |
మహేష్ బాబుపై బిగ్‌బాస్ గీతూ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ తెలుగు బిగ్‌బాస్ షో-8 వచ్చి వారం పూర్తి కావొస్తోంది. అయితే ఈ సారి హౌస్‌లోకి 14 మంది పోగా మొదటి రోజు నుంచే గొడవలు పడుతూ రచ్చ చేస్తున్నారు. అలాగే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులు తెలివితేటలతో ఆడుతూ విజయం సాధిస్తున్నారు. అయితే ఇందులో కంటెస్టెంట్ నాగమణికంఠ వచ్చినప్పటి నుంచి ఎమోషనల్ అవుతూ తన బాధను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో విగ్గు తీసి పక్కన పెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి.

ఈ క్రమంలో.. నాగమణికంఠకు సపోర్ట్ చేస్తూ మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబును లాగుతూ కామెంట్స్ చేసింది. ‘‘బిగ్‌బాస్ హౌస్‌లో నాగమణికంఠ విగ్ తీసి పక్కన పెట్టేసి చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే అతను మానసికంగా సరిగ్గా లేదు. కానీ చాలామంది రివ్యూవర్లు ఆయన విగ్గు తీసి పక్కన పెట్టడంపై వెటకారంగా మాట్లాడుతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు కానీ అది చాలా పెద్ద తప్పు. ఇండస్ట్రీలో ఉండేటప్పుడు టీవీలో అందరికీ కనిపించేటప్పుడు తాము అందంగా ఉండాలనే కోరుకుంటారు. తనకి కొంచెం హెయిర్ లేకపోవడంతో ఆ విగ్గు పెట్టుకున్నాడు. అది తప్పేం కాదుగా.

కానీ దాన్ని చాలామంది కామెడీ చేస్తున్నారు. మహేష్ బాబు కూడా హెయిర్ తక్కువుగా ఉందని ట్రాన్స్‌ప్లెంటేషన్ చేయించుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరూ అందంగా కనిపించాలనుకున్నప్పుడు అలా చేస్తారు. అలాగే నాగ మణికంఠ దగ్గర డబ్బులు లేకపోవడంతో విగ్గు పెట్టుకున్నాడు. దాన్ని కూడా కామెడీ చేస్తే అసలు మానవత్వం లేనట్లే’’ అని చెప్పుకొచ్చింది. ఇక గీతూ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నాగమణికంఠకు సపోర్ట్ చేస్తే చేసుకో కానీ మహేష్ బాబును గురించి మాట్లాడకు నువ్వు అని వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

Next Story