ఎవ్వరూ ఊహించని యాంగిల్‌లో నెటిజన్లకు షాకిచ్చిన భూమిక..

by Anjali |   ( Updated:2023-04-16 14:09:16.0  )
ఎవ్వరూ ఊహించని యాంగిల్‌లో నెటిజన్లకు షాకిచ్చిన భూమిక..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిర్మాత భరత్ ఠాకూర్‌ను 2007లో పెళ్లి చేసుకుని.. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేయడం చాలా వరకు తగ్గించారు. గతంలో టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌లకు భూమిక బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. కామన్‌గా ఏజ్ పెరుగుతుంటే ఆఫర్లు తగ్గుతూ వస్తాయి. కానీ ఈ బ్యూటీ సినీ పరిశ్రమకు ఎప్పుడూ దూరంగా లేదు. ఆమె వయసుకు తగ్గ ఏదో ఒక పాత్ర చేస్తూనే ఉన్నారు.

కాగా.. తన వైవాహిక జీవితంలో గొడవలతో ఉన్నట్లు.. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై భూమిక స్పందించి.. ‘‘ అవును నా మ్యారెజ్ లైఫ్‌లో ఇబ్బందులు ఉన్న విషయం నిజమే. కానీ మేం అన్నింటినీ ఎదుర్కొంటూ, ఒకరినొకరం అర్థం చేసుకుంటూ హ్యాప్పిగా కలిసే ఉంటున్నామని భూమిక సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే తన ఆమె తాజాగా దిగిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోల్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






Also Read..

నీ బేకారుమాటలకు భయపడను.. త్వరలోనే అంతు చూస్తా!

Advertisement

Next Story