బాలీవుడ్ నుంచి బెస్ట్ అప్ కమింగ్ దేశభక్తి చిత్రాలు..!

by Prasanna |   ( Updated:2023-08-15 11:28:19.0  )
బాలీవుడ్ నుంచి బెస్ట్ అప్ కమింగ్ దేశభక్తి చిత్రాలు..!
X

దిశ, సినిమా: ఇప్పటికే అనేక మంది ఉద్యమ వీరులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ క్రమంలోనే దేశభక్తుల బయోపిక్స్ త్వరలో వెండితెరపై ప్రత్యక్షం కాబోతున్నాయి. అవేంటో చూసేద్దాం.

* సయ్యద్‌ అబ్దుల్‌ రహీం భారత ఫుట్ బాల్ చరిత్రలో మేటి కోచ్. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మైదాన్‌’. దర్శకుడు అమిత్‌ శర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సయ్యద్‌ అబ్దుల్‌ రహీం పాత్రలో అజయ్ దేవ్‌గన్ నటించగా, ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. త్వరలో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.

* ఇషాన్‌ ఖట్టర్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పిప్పా’. దర్శకుడు రాజా కృష్ణమీనన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో పోరాట పటిమ చూపించిన బ్రిగేడియర్‌ ‘బలరామ్‌ సింగ్‌ మెహతా’ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది.

* పాకిస్థాన్‌-భారత్‌కు మధ్య 1971లో జరిగిన యుద్ధం కీలకమైంది. ఈ వార్‌లో భారత్ విజయం సాధించగా.. త్రివిధ దళాల అధిపతి శ్యామ్‌ బహదూర్‌ మానెక్‌షా కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితం ఆధారంగా ‘శ్యామ్‌ బహదూర్‌’ చిత్రం రూపొందుతుంది. మేఘనా గుల్జర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విక్కీ కౌశల్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది.

* దర్శకుడు కన్నన్‌ అయ్యర్‌ పేట్రియాటిక్ మూవీ ‘ఏ వతన్‌ మేరే వతన్‌’.. సారా అలీఖాన్‌ లీడ్ రోల్ చేస్తుండగా.. భారత స్వాతంత్రోద్యమం సమయంలో జరిగిన ఓ యువతి కథే ఈ చిత్రం. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాలు నిర్మిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 30న విడుదలవుతోంది.

Read More: నా బాడీ సైజుల గురించి మా అమ్మను టార్చర్ చేశారు.. ఆమె పట్ల నీచంగా ప్రవర్తించారు

Advertisement

Next Story