తెలుగు స్టార్ హీరోలతో నటించిన బ్యూటీ ..క్యాన్సర్ తో పోరాడి పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ..

by Kavitha |   ( Updated:2024-04-25 05:43:56.0  )
తెలుగు స్టార్ హీరోలతో నటించిన  బ్యూటీ ..క్యాన్సర్ తో పోరాడి పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ..
X

దిశ,సినిమా: మురారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సోనాలి బింద్రే అందరికీ సుపరిచితమే. ఈ సినిమాతో ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈ అమ్మడు తెలుగులో మురారి, మన్మధుడు, శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి చిత్రాల్లో నటించింది. ఆమె 2018లో క్యాన్సర్ బారిన పడి న్యూయార్క్‌లో చికిత్స అనంతరం కోలుకున్న విషయం అందరికీ తెలిసినదే. 2013 నుంచి ఆమె ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

అయితే సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ రంగుల ప్రపంచంలోకి సోనాలి బింద్రే అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆమె పలు రియాలిటీ షోలలో జడ్జ్‌గా చేసింది. అయితే, ఇప్పుడు జీ5 వేదికగా మే 3 నుంచి ప్రసారం కానున్న ‘ది బ్రోకెన్ న్యూస్‌ సీజన్‌ 2’వెబ్‌ సిరీస్‌లో కనిపించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా చాలా రోజుల తర్వాత పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఇప్పుడు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా కారణం ఉందని ఇలా చెప్పుకొచ్చారు. 'ఇప్పుడు నాకు కూడా డబ్బు అవసరం ఉంది. నేను చెల్లించాల్సిన బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. అందుకోసం నేను పని చేయవలసి ఉంది. నా కుటుంబం కూడా చాలా క్లిష్టమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అని ఆమె తెలిపారు.


చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోయిన్‌ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నడంతో ఫ్యాన్స్‌ కూడా గ్రాండ్‌గా స్వాగతం పలుకుతున్నారు.

Advertisement

Next Story