- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవితేజ విషయంలో జాగ్రత్త.. ఆ డైరెక్టర్‌ను హెచ్చరించిన రాజమౌళి
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతూ.. ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రవితేజ నటించిన ‘‘రావణాసుర’’ చిత్రం విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపిచంద్ మలినేని హాజరై.. రవితేజ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం రవితేజనే. ఆయన నేను ఒకే పోలికలు కలిగి ఉండడంతో అందరూ... రవితేజ నేను అన్నదమ్ములు అని అనుకున్నారు. అలా ఉండడం నా అదృష్టంగా భావించాను.
నాకు మొదటగా ‘డాన్ శీను’ చిత్రంలో అవకాశం ఇచ్చి ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా డైరెక్టర్ రాజమౌళిని పిలుద్దామని వెళ్లాను. రవితేజతో సినిమా చేస్తున్న అని విషయం చెప్పగానే ఇలా అన్నారు. ఆయనను ఒక వేరియేషన్ అడిగితే నాలుగు వేరియేషన్లు చేసి చూపిస్తారు. ఆయనతో జాగ్రత్త రవితేజ ఎనర్జీని అందుకోవడం చాలా కష్టం. ఇక రవితేజ విషయంలో నీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు దూసుకెళ్లిపో అంటూ రాజమౌళి రవితేజ విషయంలో నన్ను ఈ విధంగా హెచ్చరించారని’’ అప్పటి విషయాలను గోపీచంద్ గుర్తు చేసుకుంటూ చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.