Bigg Boss 7 Telugu: అదిరిపోయే న్యూస్.. బిగ్ బాస్7లోకి బ్యాంకాక్ పిల్లా?

by samatah |   ( Updated:2023-07-13 06:08:02.0  )
Bigg Boss 7 Telugu:  అదిరిపోయే న్యూస్.. బిగ్ బాస్7లోకి బ్యాంకాక్ పిల్లా?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్7 త్వరలో రాబోతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తాజాగా ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది. ఎవరెవరో హౌస్‌లోకి వెళ్లబోతున్నారో అని ప్రేక్షకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ సెవన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యాంకాక్ పిల్లను ఇందులో తీసుకురాబోతున్నట్లు సమాచారం.. బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ తో శ్రావణి సమంతపూడి భారీ ఫేమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు భాష, యాసతో బ్యాంకాక్ నుంచి వరుసగా వీడియోలు షేర్ చేస్తూ నగరంలోని అన్ని ప్రాంతాలలో తిరుగుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను అందరికీ షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే ఈమె విజయనగరానికే చెందింది కాబట్టి బిగ్ బాస్ సెవెన్ లోకి రాబోతున్నట్లు ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.అంతేకాదు ఆమె నిన్న తన కుటుంబంతో ఇండియా వచ్చేసిందని, షోలో పాల్గొనడానికే తాను ఇండియా వచ్చేసిన్లు తెలుస్తుంది.

Read more: హద్దులు చెరిపేస్తున్న శ్రీలీల.. ఆ హీరోతో డైరెక్ట్‌ లిప్ లాక్‌కు రెడీ?

Advertisement

Next Story