Chandra Babu, విజయ్ సాయిరెడ్డిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

by Hamsa |   ( Updated:2023-02-20 05:52:19.0  )
Chandra Babu, విజయ్ సాయిరెడ్డిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడు. ఏదో ఒక విషయంపై నిత్యం స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తుంటాడు. తాజాగా, విజయ్ సాయిరెడ్డి, చంద్రబాబుపై ఓ ట్వీట్ చేశాడు. నందమూరి తారకరత్న మరణంతో టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి నివాళులు అర్పించేందుకు తారకరత్న ఇంటికి చేరుకున్నారు.

చంద్రబాబు నాయుడు, విజయ సాయిరెడ్డి పక్కన కూర్చొని ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటోపై బండ్ల గణేష్ సెటైర్లు వేశాడు. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి.! అంటూ వారిద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

Advertisement

Next Story