'బాలుగాడి లవ్ స్టోరీ'.. టీజర్‌ విడుదలచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

by srinivas |   ( Updated:2023-01-17 10:49:58.0  )
బాలుగాడి లవ్ స్టోరీ.. టీజర్‌ విడుదలచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్
X

దిశ, సినిమా: ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాలుగాడి లవ్ స్టోరీ'. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి సబంధించిన టీజర్‌ను మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేయించగా దర్శకులు సముద్ర చిత్ర మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశాడు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ హరి గౌడ్, శ్రీహరి గౌడ్, రెవలాన్స్ కాస్మటిక్స్ సౌత్ ఇండియా ఇన్‌చార్జ్ మహేష్, చిందం మహేందర్ సినిమా పెద్ద హిట్ కావాలంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే మంచి కాన్సెప్ట్ ఉన్న కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న దర్శకనిర్మాతలు మార్చిలో విడుదలకాబోతున్న తమ సినిమాను ఆదరించాలని కోరగా ఘనశ్యామ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి : '#VD12'.. ఉత్కంఠరేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్‌!

Advertisement

Next Story