- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకు మోక్షజ్ఞకు ఆ హీరోయిన్ ను సెట్ చేస్తున్న బాలయ్య..!
దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్.. తెలుగు వెండితెర దేవుడు, సినీ కళామతల్లి ముద్దు బిడ్డ. అచెంచల దీక్షతో అశేషాంద్ర తెలుగు ప్రజల మన్ననలు పొందిన కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం. ఇప్పటికీ నందమూరి కుటుంబానికి తెలుగు సినీ రంగలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నందమూరి బాలకృష్ణ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. నేటికీ ఇండస్ట్రీలో అత్యున్నత నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
అదే ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయంపై కొన్నేళ్లుగా చర్చలు జరుగుతున్నా ఖచ్చితంగా వచ్చే సంవత్సరం బాలయ్య నట వారసుడి అరంగేట్రం ఉంటుందని నందమూరి అభిమానులు ఫిక్సైపోయారు. ఇందుకు గాను మోక్షజ్ఞ కూడా కఠినంగా వర్కవుట్ చేసి ఊహించని విధంగా బరువు తగ్గి చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.
కాగా, ఇటీవలే సోషల్ మీడియాలో మోక్షజ్ఞ సినిమా కు సంబంధించి ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ మోక్షజ్ఞకు జోడీగా బాలకృష్ణ ఓ చక్కని చుక్కను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. తను ఎవరో కాదు.. నటి శ్రీలీల. చక్కని నటనతో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న బ్యూటీ మోక్షజ్ఞకు హీరోయిన్ గా ఫైనలైజ్ అయ్యిందట. మొత్తానికి తన కుమారుడి కోసం బాలయ్య బాబు భలే అమ్మాయిని సెలెక్ట్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read More..