- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బలగం’ సినిమాపై వివాదం.. కథ నాదంటున్న గడ్డం సతీష్
దిశ, సినిమా: కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దిల్ రాజు సమర్పణలో హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మించిన సినిమా తెలంగాణ జీవన విధానానికి అద్దం పడుతుందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కానీ ఈ కథ తనదేనని ఆరోపిస్తున్నాడు జర్నలిస్ట్ గడ్డం సతీష్. 2011లో ‘పచ్చికి’ పేరుతో ఈ కథ రాసుకున్నానని.. తన తాత మరణించినప్పుడు నెలకొన్న సంఘటనల ఆధారంగా స్టోరీ రాశానని తెలిపాడు.
కానీ, అప్పుడున్న ఆంధ్ర మీడియా ఈ కథను పబ్లిష్ చేసేందుకు ఒప్పుకోకపోవడంతో.. నమస్తే తెలంగాణ లో జాయిన్ అయ్యానని, 2014లో ఈ కథ ప్రచురించారని వివరించాడు. ఆ కథకే కొంచెం మార్పులు చేర్పులు చేసి వేణు సినిమా తీశాడని ఆరోపించాడు. ఇప్పుడు తెలంగాణ కథలకు పట్టం కడుతున్న దిల్ రాజు.. ఆంధ్ర వారి పాలనలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించాడు. నిర్మాతగా రాణించేందుకు ఇప్పుడు తెలంగాణ పాలకుల చుట్టూ తిరుగుతున్నాడని ఫైర్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి : బాహుబలి-2 రికార్డు బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’