అదృష్టం అంటే ఇదే.. మెగా ఆఫర్ కొట్టేసిన బలగం బ్యూటీ!

by Jakkula Samataha |
అదృష్టం అంటే ఇదే.. మెగా ఆఫర్ కొట్టేసిన బలగం బ్యూటీ!
X

దిశ, సినిమా : ‘‘వల్లంగి పిట్ట వల్లంగి పిట్టా’’ అంటూ గంగోత్రి సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్. ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె మసుదా సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ కమెడియన్, నటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమాతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. ఒక్కసారిగా ఈమె క్రేజ్ పెరిగిపోయింది.

బలగం సినిమా తర్వాత కావ్యకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అంతే కాకుండా ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ తన గ్లామర్ డోస్ మరింత పెంచింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో కుర్రకారును మాయచేస్తోంది. ట్రెండీ దుస్తుల్లో తన హొయలు చూపిస్తూ.. అందాలతో బాణం విసురుతుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే బలగం బ్యూటీ క్రేజీ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈయన ప్రస్తుతం గాంజా శంకర్ అనే సినిమా తీస్తున్నారు. ఆ తర్వాత రోహిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇందులో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది గనుక నిజం అయితే ఈ బ్యూటీకి అదృష్టం కలిసి వచ్చినట్లే అంటున్నారు తన ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed