మొహం మీద అలా అనడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. అవినాష్ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-05-12 14:44:52.0  )
మొహం మీద అలా అనడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. అవినాష్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ తెచ్చుకున్న ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఆయన మొదట జబర్దస్త్ షోలో పలు స్కిట్స్ చేసి జనాలు నవ్వించాడు. ఆ తర్వాత పలు షోస్, చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం వరుజ షోస్ చేస్తూ స్టార్ కమెడియన్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ తన జీవితంలో ఎదురైన అనుభవాలను చెప్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘ జబర్దస్త్‌లో ఫామ్‌లో ఉండగానే నేను ఇళ్లు కట్టకున్నాను. అయితే సేవ్ చేసిన డబ్బులన్నీ దానికి పెట్టాల్సి వచ్చింది. అప్పుడే కరోనా రావడంతో లాక్ డౌన్ పడి అప్పులు చేయాల్సి వచ్చింది వడ్డీలు పెరిగాయి.

పని లేకపోవడంతో కట్టలేకపోయాను. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్లు నన్ను ఒత్తిడి చేశారు. నేను జబర్దస్త్ షోలో చేసినప్పుడు నా కామెడీ బాగుందని చెప్పిన వాళ్ళు నా మొహం మీద తిట్టారు. దీంతో మానసికంగా కుంగిపోయాను. ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. నా జీవితంలో ఆకలి బాధలు ఉన్నాయి. కానీ అప్పుల బాధలు లేవు. ఇల్లు కట్టినప్పుడు అవి మొదటిసారి ఎదుర్కోవడంతో.. తట్టుకోలేకపోయాను. నీటిలో దూకి చనిపోవాలని బావి దగ్గరకు కూడా వెళ్లాను.

అప్పుడే ఒకసారి ఆలోచించి తప్పు చేస్తున్నా అనిపించింది. గెటప్ శ్రీనుకు ఫోన్ చేసి మాట్లాడాను. అయితే అప్పుడు శ్రీను ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్‌లో ఉన్నాడు. దీంతో పూరి జగన్నాథ్‌లో మాట్లాడించాడు. ఆయన ఒక ఐదు నిమిషాలు నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. పూరి మాటలతో బతకాలని అనుకున్నాను. ఈ సంఘటన జరిగిన మూడు నాలుగు రోజులకే నాకు బిగ్‌బాస్‌లో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత నా ఇబ్బందులు తెలుసుకుని నా జబర్దస్త్ ఫ్రెండ్స్ సహాయం చేశారు. శ్రీముఖి కూడా ఐదు లక్షలు ఇచ్చింది. వాళ్ల వల్లే నా సమస్యలు తీరిపోయాయి. ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. వరుస షోస్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More...

సింగర్ గీతా మాధురితో విడాకులు.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన భర్త నందు లైవ్‌లో అలా చేయడంతో

Advertisement

Next Story