'పాప్ కార్న్' ట్రైల‌ర్ రిలీజ్ చేసిన నాగార్జున‌.. పెద్ద హిట్ అవుతుందంటూ

by Harish |   ( Updated:2023-01-04 13:51:55.0  )
పాప్ కార్న్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన నాగార్జున‌.. పెద్ద హిట్ అవుతుందంటూ
X

దిశ, సినిమా: అవికా గోర్‌, సాయిరోన‌క్ జంట‌గా వస్తున్న చిత్రం 'పాప్ కార్న్'. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్పణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా నిర్మించిన సినిమాకు ముర‌ళి గంధం ద‌ర్శకత్వం వ‌హించాడు. కాగా ఫిబ్రవరి 10న విడుదలకాబోతున్న చిత్రంనుంచి అక్కినేని నాగార్జున చేతులమీదుగా ట్రైల‌ర్ రిలీజ్ చేయించారు మేకర్స్.

ఈ సందర్భంగా మాట్లాడిన కింగ్.. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుతూ అవికా ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఎన‌ర్జీ లెవల్స్ అద్భుతంగా ఉన్నాయని 'పాప్ కార్న్' పెద్ద హిట్ అవుతుందనే న‌మ్మకం ఉందన్నాడు. అలాగే చివ‌రి 45 నిమిషాలు అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుందని, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్న మూవీ టీమ్.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ప్యూర్ ల‌వ్ స్టోరిని వాలెంటైన్స్ డే కంటే ముందే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి శ్రవ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌ సంగీతం అందించాడు.



Advertisement

Next Story

Most Viewed