Bhola Shankar Review : ‘భోళా శంకర్’ బోల్తా..! ట్రెండింగ్‌లోకి కొరటాల..!

by sudharani |   ( Updated:2023-08-12 12:15:34.0  )
Bhola Shankar Review : ‘భోళా శంకర్’ బోల్తా..! ట్రెండింగ్‌లోకి కొరటాల..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి లెటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు- 11న రిలీజ్ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. అయితే.. ఈ మూవీ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాలం’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఆల్రెడీ తెలిసిన స్టోరీ కారణంగానో లేక సినిమాలో సీన్స్ పండక పోవడం తెలియదు కానీ ‘భోళా శంకర్’ మూవీకి ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందలేక పోయింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో సడెన్‌గా డైరెక్టర్ కొరటాల శివ నెట్టింట ట్రెండింగ్‌గా మారారు. చిరంజీవితో కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా ప్లాప్ కావడంతో డైరెక్టర్ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు భోళా శంకర్ చిత్రానికి యావరేజ్ టాక్ వస్తుండడంతో నెటిజన్లు కొరటాల శివతో లింక్ పెడుతూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ.. భోళా శంకర్ చిత్రాన్ని ట్రోల్ చేస్తున్నారు. కథ యాక్షన్ పార్ట్ అటుంచితే.. మంచి హాస్య భరితమైన సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో లేవని.. ఈ టైంలో కొరటాల రియాక్షన్ ఇదే అంటూ పలు పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఈ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.

Read More: ఆ సమయం ఎంతో కఠినమైనది చావును దగ్గర నుండి చూశాను.. హీరో విశాల్ ఎమోషనల్ కామెంట్స్

Advertisement

Next Story