Teaser: మనం ఆర్డినరీ అయినా అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి.. వైరల్‌గా నాని డైలాగ్స్

by sudharani |
Teaser: మనం ఆర్డినరీ అయినా అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి.. వైరల్‌గా నాని డైలాగ్స్
X

దిశ, సినిమా: ‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్న పవన్ కుమార్ కొత్తూరి.. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'యావరేజ్ స్టూడెంట్ నాని' అనే టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి.. కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌తో మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా సాగింది టీజర్. ఇందులో యూత్‌కు కావాల్సిన రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ప్రజెంట్ ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed