పెళ్లికి ముందు SEX.. ప్రేమికులు అలాగే చేయాలంటున్న నటి

by Hamsa |   ( Updated:2023-09-11 17:14:55.0  )
పెళ్లికి ముందు SEX.. ప్రేమికులు అలాగే చేయాలంటున్న నటి
X

దిశ, సినిమా: ‘మీటర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ అతుల్య రవి.. మారుతున్న కల్చర్, పెళ్లికి ముందు సెక్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఆమె రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ అండ్ కెరీర్ గురించి మాట్లాడింది. ‘నేను దేనిగురించైనా నిర్మొహమాటంగా నా అభిప్రాయాలను వ్యక్తపరుస్తా. మనసులో దాచుకుని మదనపడను. సినిమాల ఎంపికలోనూ అంతే. అలాగే నేటి యువతలో సహజీవనం చేసే సంఖ్య పెరుగుతుంది. దీంతో రిలేషన్స్ కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. నా దృష్టిలో సహజీవనం అనేది వ్యక్తిగత విషయం. అయితే పెళ్లికి ముందు శృంగారాన్ని సమర్థించను. మన భారతీయ సంస్కృతికి విరుద్ధం. అది కావాలనుకుంటే పెళ్లి చేసుకోవడం ఉత్తమం’ అని చెప్పింది. ఇక ప్రేమలో ఉన్నవారు జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుందని, లేదంటే చాలా ప్రాబ్లమ్స్‌ ఎదుర్కోవాల్సివస్తుందంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి : ఆ పని చేయకపోతే అస్సలు నిద్రపట్టదు.. ప్రతిరోజూ ఉండాల్సిందే

Advertisement

Next Story