‘అథర్వ’ సినిమాపై అంచనాలు పెంచిన టీజర్

by sudharani |
‘అథర్వ’ సినిమాపై అంచనాలు పెంచిన టీజర్
X

దిశ, సినిమా : కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అథర్వ’ టీజర్ రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన హీరో ఆకాష్ పూరి, క్లూస్ హెడ్ వెంకన్న, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, స్పై డైరెక్టర్ & ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్స్ సుశాంత్ రెడ్డి, కనక మామిడిలు మూవీ యూనిట్‌ వర్క్‌ను ప్రశంసించారు.

ఒక నిమిషం 15 సెకనుల నిడివితో కట్ చేసిన టీజర్‌లో క్రైం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచేశాయి. వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీ చేధించేందుకు సైబరాబాద్ క్లూస్ టీమ్‌లో జాయిన్ అయిన హీరో.. హంతకులను పట్టుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు? అనే సీన్స్ ఆసక్తికరంగా చూపిస్తూ.. ప్రేక్షకుల అటెన్షన్ క్యాచ్ చేశారు మేకర్స్. ఇక మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సుభాష్ నూతలపాటి నిర్మాత కాగా శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

Next Story